మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910–సెప్టెంబర్ 5, 1997), ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆంగ్ల ఉచ్ఛారణ: /aɡnɛs ɡɔnˈdʒa bɔˈjadʒju/), గా జన్మించిన అల్బేనియా[2][3] దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ [4] పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కోల్కతా(కలకత్తా) లో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాధలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు. మాల్కం ముగ్గేరిడ్జ్ చే రచింపబడిన సమ్ థింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ అనే పుస్తకం, మరియు డాక్యుమెంటరీద్వారా 1970 ల నాటికి మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న ను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాధ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది. ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు.ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శించాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.[5] ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్)మరియు బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు. విషయ సూచిక 1 ప్రారంభ జీవితం 2 మిషనరీస్ అఫ్ ఛారిటీ 3 అంతర్జాతీయ దాతృత్వం 4 క్షీణించిన ఆరోగ్యం మరియు మరణం 5 ప్రపంచవ్యాప్త గుర్తింపు మరియు ఆదరణ 5.1 భారతదేశంలో ఆదరణ 5.2 ప్రపంచదేశాల ఆదరణ 6 ఆధ్యాత్మిక జీవితం 7 అద్భుతము మరియు ఆశీర్వాదము (బీటిఫికేషన్) 8 జ్ఞాపక చిహ్నలు 9 చిత్రాలు మరియు సాహిత్యం ప్రారంభ జీవితం మదర్ థెరీసా జన్మించిన స్థలం ఆగ్నెస్ గొంక్శే బోజక్షిహ్యు (గొంక్శే అనే పదానికి " అల్బేనియన్ భాష లో గులాబీ మొగ్గ అని అర్ధం) ఆగష్టు 26, 1910, ఉస్కుబ్, ఒట్టోమన్ సామ్రాజ్యం(ఇప్పుడు స్కోప్జే, మాసిడోనియా)యొక్క ముఖ్య పట్టణంలో జన్మించారు. ఆమె ఆగష్టు 26 న జన్మించినప్పటికీ, క్రైస్తవమతం స్వీకరించిన ఆగష్టు 27,ను తన నిజమైన జన్మదినంగా భావించే వారు. ఆమె అల్బేనియాలోని స్కోదర్ చెందిన నికోల్లె మరియు డ్రాన బొజాక్షిహ్యు దంపతుల ఆఖరి సంతానం. ఈమె తండ్రి అల్బేనియా రాజకీయాలలో పాల్గొనేవారు. 1919 లో, ఆగ్నెస్ కు ఎనిమిది సంవత్సరాల వయస్సున్నపుడు, స్కోప్జేని అల్బేనియా నుండి తొలగించే నిర్ణయం తీసుకున్న ఒక రాజకీయ సమావేశం తరువాత ఆమె తండ్రి జబ్బుపడి మరణించారు. ఆ సమయంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలో నున్న. ఆమె ఆగష్టు 26, 1910, న జన్మించి నప్పటికీ తానూ మతం స్వీకరించిన ఆగష్టు 27, 1910, న తన "నిజమైన పుట్టిన రోజు"గా భావించారు.[6]. కొన్ని వర్గాలు ఆమె తండ్రి చనిపోయే నాటికి ఆమె వయస్సు 10 సంవత్సరాలని తెలిపినప్పటికీ, ఆమె సోదరుని ఇంటర్వ్యూద్వారా, వాటికన్ పత్రాలద్వారా ఆమెవయస్సు ఎనిమిది సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తూంది. ఆమె తండ్రి మరణం తరువాత తల్లి ఆమెను రోమన్ కథొలిక్ గా పెంచారు.జోన్ గ్రాఫ్ఫ్ క్లూకాస్ చే రచింపబడిన జీవితచరిత్ర ప్రకారం ఆమె తన బాల్యం లోనే మతప్రచారకుల జీవిత కథలపట్ల వారి సేవల పట్ల ఆకర్షింపబడ్డారు, 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ అఫ్ లోరెటో అనే ప్రచారకుల సంఘంలో చేరారు. తరువాతి కాలంలో తన తల్లిని కాని, సోదరిని కానీ కలవలేదు. ప్రారంభంలో ఆమె సిస్టర్స్ అఫ్ లోరెటో భారతదేశంలో విద్యార్దులకు బోధించే ఇంగ్లీష్ ను నేర్చుకోవడానికి ఐర్లాండ్ లోని రాట్ ఫారన్హమ్ గలలోరెటో అబ్బీకి వెళ్లారు.[7] 1929 లో, ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారత దేశంలో హిమాలయ పర్వతాల వద్ద నున్న డార్జిలింగ్ కి వచ్చారు.[8] మే 24, 1931 లో ఆమె సన్యాసినిగా తన మొదటి మతప్రతిజ్ఞ చేసారు.మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ ఐన తెరేసే డి లిసే పేరు మీదుగా తన పేరును తెరెసాగా మార్చుకున్నారు.[9][10]. మే 14, 1937 లో తూర్పు కలకత్తాలోని లోరెటో కాన్వెంటు స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నపుడు తన పవిత్రప్రతిజ్ఞ చేసారు.[2][11] పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆనందించినప్పటికీ, కలకత్తా చుట్టుపక్కల పేదరికం ఆమెను కదిలించి వేసింది.[12] 1943 లో ఏర్పడిన కరువు కలకత్తా నగరానికి కష్టాలను మరియు మరణాలను తీసుకు వచ్చింది మరియు ఆగష్టు 1946 లో ఏర్పడిన హిందూ/ముస్లిం హింస నగరాన్ని నిరాశ మరియు భయాందోళనలకు గురిచేసింది.[13] మిషనరీస్ అఫ్ ఛారిటీ మిషనరీస్ అఫ్ ఛారిటీ సాంప్రదాయక చీరకట్టుతో. సెప్టెంబర్ 10, 1946, లో తెరెసా తన సాంవత్సరిక విరామం లో భాగంగా కలకత్తానుండి డార్జిలింగ్ లోని లోరెటో కాన్వెంటుకు ప్రయాణం చేస్తున్నపుడు తాను "పిలుపులో పిలుపు"గా పొందిన అనుభవాన్ని గుంరించి తెలియ చేసారు. నేను కాన్వెంటును వదిలి పేదల మధ్య నివశిస్తూ వారికి సేవ చేయాలి.ఇది ఒక ఆజ్ఞ.దీనిని పాటించకపోతే విశ్వాసాన్ని కోల్పోయినట్లే."[14] 1948 లో ఆమె తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి నిరాడంబరమైన, నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించి, భారత పౌరసత్వము స్వీకరించి మురికి వాడలలో ప్రవేశించారు.ఆమె మొదట మొతిజిల్ లో ఒక పాఠశాలను స్థాపించారు; అటు వెంటనే అనాధల మరియు అన్నార్తుల అవసరాలను తీర్చ సాగేరు.[15] తొందరలోనే ఆమె కార్యక్రమాలు అధికారుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రధానమంత్రి ప్రశంసలు అందుకునేలా చేసాయి. తెరెసా తన డైరీలో తన తొలి సంవత్సరం కష్టాలతో నిండి ఉన్నట్లుగా వ్రాసుకున్నారు.ఆమెకు ఆదాయం లేకపోవడం వలన ఆహారం మరియు ఇతర సరఫరాల కొరకు యాచించవలసి వచ్చేది.ఈ ప్రారంభ నెలలలో ఒంటరి తనము మరియు ఆశ్రమ జీవితంలోని సౌకర్యాలకు మరలి పోవాలనే ప్రేరేపణ వంటి సంశయాలను కలిగి ఉన్నారు.ఈ విషయాలను తన డైరీలో వ్రాసుకున్నారు: “ మా దేవుడు నన్ను పేదరికం అనే శిలువతో కప్పబడిన స్వేచ్ఛా సన్యాసినిగా వుండమంటున్నాడు. నేను ఈరోజు మంచి పాఠం నేర్చుకున్నాను. పేదల బీదరికం వారికి చాలా కష్టంగా వుండివుండాలి. ఒక ఇల్లు కొరకు వెతుకుతూ నా కాళ్లు చేతులు నొప్పిపుట్టేంతవరకూ నడిచాను. పేదవారు ఇంటికొరకు, ఆహారం మరియు ఆరోగ్యం కొరకు వెతుకుతూ శరీరంలోను మరియు ఆత్మలోను ఎంత బాధపడుతున్నారోనని అనుకున్నాను. అప్పుడు లోరెటో లో నున్న సుఖప్రధమైన జీవితం నన్ను లాలసకు గురిచేసింది. నీవు ఒక్క మాటంటే చాలు మరల ఆ పాత జీవితం మరలం నీదవుతుందని నన్ను లోంగదీసుకోనే గొంతు చెప్తున్నది. నా స్వేచ్ఛమైన మనస్సుతో దేవుడా, నీపై ప్రేమతో, నేను ఇక్కడే వుంటాను.నాగురించి నీ పవిత్ర ఇష్టాన్ని నెరవేరుస్తాను. నేను ఒక కన్నీటిబొట్టు కూడా రానివ్వలేదు.[16] ” అక్టోబర్7, 1950 ఆమె వాటికన్ అనుమతితో మతగురువుల సంఘాన్ని ప్రారంభించారు అదే తరువాత మిషనరీస్ అఫ్ ఛారిటీగా రూపొందింది. ఆమె మాటలలో "ఆకలిగొన్న వారల, దిగంబరుల, నిరాశ్రయుల, కుంటి వారల,కుష్టు వ్యాధి గ్రస్తుల, అందరూ త్యజించారని భావించే వారల, ప్రేమించబడని వారల, సమాజంచే నిరాకరింపబడిన వారల, సమాజానికి భారమైన వారల మరియు అందరిచే విసర్జింపబడిన వారల " ను జాగ్రత్తగా చూడడమే ఈ సంఘం యొక్క కర్తవ్యం. ఇది కలకత్తాలో స్వల్ప స్థాయిలో 13 మంది సభ్యులతో మొదలైంది;నేడు ఇది 4,000 కు పైగా సన్యాసినులను కలిగి అనాధ శరణాలయాలు, ఎయిడ్స్ ధర్మశాలలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ, శరణార్ధులకు, అంధులకు, అంగవికలురకు, వృద్ధులకు, మధ్యపాన గ్రస్తులకు, బీదవారికి మరియు నిరాశ్రయులకు, వరద బాధితులకు, అంటువ్యాధులు మరియు కరువు బాధితులకు సహాయం చేస్తోంది. కోల్కతా లో నిర్మల్ హృదయ్ (2005) 1952 లో మదర్ థెరీసా కలకత్తా నగరంచే ఇవ్వబడిన స్థలంలో మొదటి హోమ్ ఫర్ ది డయింగ్ ను ప్రారంభించారు.భారతదేశ అధికారుల సహాయంతో ఆమె ఒక పాడుబడినహిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాల గా మార్చారు.ఆమె దానికి కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం ( కాళీఘాట్ హోం ఫర్ ది డయింగ్) (నిర్మల్ హృదయ్) గా పేరు పెట్టారు .ఈ నిలయానికి తీసుకురాబడిన వారికి వైద్య సహాయాన్ని అందించి, వారి నమ్మకాల ప్రకారం ఆచార కర్మల ననుసరించి గౌరవంగా చనిపోయే అవకాశం కల్పించారు. ముస్లింలు ఖురాన్ చదివేవారు, హిందువులకు గంగా జలం అందించేవారు, కాథలిక్స్ కు వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు జరుపబడేవి.ఆమె మాటలలో అది "ఒక అందమైన చావు", "జంతువులలా బ్రతికిన మనుష్యులకు దేవతల వంటి చావును కల్పించడం-ప్రేమతో మరియు అక్కరతో." ఆ వెంటనే మదర్ థెరీసా సాధారణంగా కుష్టు వ్యాధిగా పిలువబడే హాన్సెన్ వ్యాధి గ్రస్తులకు శాంతి నగర్ అనే పేరుతో ధర్మశాలను ఏర్పాటు చేసారు.[17] మిషనరీస్ అఫ్ ఛారిటీ కుష్టు వ్యాధిని అధిగమించుట కొరకు కలకత్తా నగరవ్యాప్తంగా వైద్యశాలలను ఏర్పాటు చేసి, వైద్యాన్ని, కట్టు కట్టడానికి అవసరమైన వస్త్రాలను మరియు ఆహారాన్ని అందచేసింది. మిషనరీస్ అఫ్ ఛారిటీఅధిక సంఖ్యలో తప్పిపోయిన పిల్లలను చేరదీసింది, మదర్ థెరీసా వారికి ఆశ్రయాన్ని కల్పించాలని భావించారు. 1955 లో ఆమె అనాధలకూ మరియు నిరాశ్రయులైన యువకుల కొరకు, పరిశుద్ధ హృదయ బాలల ఆశ్రయమైన నిర్మల శిశు భవన్ ను ప్రారంభించారు. ఈ సంస్థ త్వరలోనే అనేకమంది కొత్త వ్యక్తులను మరియు విరాళాలను ఆకర్షించింది, 1960 నాటికి భారతదేశ వ్యాప్తంగా అనేక ధర్మశాలలను, అనాధ శరణాలయాలను, మరియు కుష్టు వ్యాధి గ్రస్తులకేంద్రాలను ఏర్పాటు చేసింది.మదర్ థెరీసా తన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు.భారతదేశం వెలుపల వీరి మొదటి ఆశ్రయం వెనిజులాలో 1965 లో ఐదుగురు సిస్టర్స్ తో మొదలైంది. తరువాత 1968 లో రోమ్, టాంజానియా, మరియు ఆస్ట్రియాలలో ; 1970 లలో ఆసియా , ఆఫ్రికా, యూరోప్లలో అనేక దేశాలలో , మరియు యునైటెడ్ స్టేట్స్లో అనేక ఆశ్రయాలను మరియు ఫౌండేషన్లను స్థాపించింది. ఆమె తాత్త్వికత మరియు ఆచరణలు కొంత విమర్శకు గురిఅయ్యాయి. మదర్ థెరీసా ప్రజలను కేవలం బ్రతికి ఉంచేందుకు పరిమితమయ్యారు కాని వారి దారిద్ర్యాన్ని సమూలంగా తొలగించేందుకు ప్రయత్నించలేదని డేవిడ్ స్కాట్ వ్రాసారు.[18] బాధితుల పట్ల ఆమె దృక్పధం పట్ల కూడా ఆమె విమర్శలను ఎదుర్కొన్నారు.అల్బెర్ట రిపోర్ట్ లోని ఒక వ్యాసం, ఆమె, బాధ అనేది ప్రజలను క్రీస్తు సమీపానికి చేరుస్తుందని భావించారని తెలియచేసింది.[19] అంత్యదశలో ఉన్న రోగగ్రస్తులకు హోమ్ ఫర్ డయింగ్ లో అందించే సేవలు వైద్య పత్రికారంగ విమర్శలకు గురయ్యాయి, ప్రత్యేకించి ది లాన్సెట్] మరియు బ్రిటిష్ మెడికల్ జర్నల్ చర్మము క్రింద ఇచ్చే సూదులను తిరిగి వాడటాన్ని, దయనీయమైన నివాస పరిస్థితులను, రోగులందరికీ చన్నీటి స్నానాలను, మరియు సరైన రోగానిర్ధారణకు దోహదం చేయని భౌతికవాద వ్యతిరేక ధోరణిని విమర్శించాయి.[20] ది మిషనరీస్ అఫ్ ఛారిటీ బ్రదర్స్ సంస్థను 1963 లోను, ధ్యానపరులైన సిస్టర్ల సంస్థను 1976 లోను స్థాపించబడ్డాయి.సాధారణ కాథలిక్ లు మరియు నాన్ కాథలిక్ లు కో-వర్కర్స్ అఫ్ మదర్ థెరీసాలో నమోదు చేసుకున్నారు. జబ్బులతో, వ్యాధులతో బాధపడుతున్నవారు ది లే మిషనరీస్ అఫ్ ఛారిటీలో చేరారు.2007 నాటికి మిషనరీస్ అఫ్ ఛారిటీ ప్రపంచవ్యాప్తంగా 450 మంది సన్యాసులను మరియు 5,000 మంది సన్యాసినులను కలిగి, 600 శాఖలను నిర్వహిస్తూ, 120 దేశాలలో పాఠశాలలను, ఆశ్రయాలను కలిగి ఉంది.[21] అంతర్జాతీయ దాతృత్వం 1982 లో బీరూట్ ఆక్రమణకు గురైన సందర్భంలో, మదర్ థెరీసాఇజ్రాయిల్ సైన్యానికి మరియు పాలస్తీనా గెరిల్లాలకు మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించి ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన 37 మంది పిల్లలను కాపాడారు.[22] ఈ యువ రోగులను నాశనం కాబడిన వైద్యశాల నుండి బయటకు తీసుకు రావడానికి ఆమె రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి యుద్ధరంగంలో ప్రయాణించారు.[23] 1980 లలో తూర్పు యూరోప్ బాహ్య ప్రపంచంలోకి వచ్చినపుడు, అనేక కార్యక్రమాలను ప్రారంభింప చేసి ఆమె తన ప్రయత్నాలను కమ్యూనిస్ట్ దేశాలకు విస్తరించారు.గర్భస్రావం మరియు విడాకుల పట్ల తన అభిప్రాయాలపై వచ్చిన విమర్శలను ఆమె స్థిరంగా ఎదుర్కొని, "ఎవరేమన్నా, చిరునవ్వుతో దానికి అంగీకరించి నీ పనిని నువ్వు చేసుకొని పోవాలి", అని పేర్కొనారు. మదర్ థెరీసాఇథియోపియాలో ఆకలి బాధితులకు, చెర్నోబిల్ లో అణుధార్మికత పీడితులకు, మరియు అర్మేనియాలో భూకంప వలన నష్ట పోయిన వారికి సహాయం చేసి ఓదార్చడానికి వెళ్లారు.[24][25][26] 1991 లో,మదర్ థెరీసా మొదటిసారి తన మాతృదేశానికి తిరిగి వెళ్లి అల్బేనియా లోని టిరానాలో మిషనరీస్ అఫ్ ఛారిటీ బ్రదర్స్ హోమ్ ని ప్రారంభించారు. 1996 నాటికి ఆమె 100కు పైగా దేశాలలో 517 శాఖలను నిర్వహించేవారు. ఈ కాలంలో మదర్ థెరీసా యొక్క మిషనరీస్ అఫ్ ఛారిటీ పన్నెండు శాఖల నుండి అనేక వేల శాఖలకు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా కడుబీదల సేవ కొరకు 450 శాఖలను కలిగి ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మిషనరీస్ అఫ్ ఛారిటీ యొక్క మొట్ట మొదటి శాఖను సౌత్ బ్రోంక్స్, న్యూయార్క్ లో ప్రారంభించారు; 1984 నాటికి దేశ వ్యాప్తంగా ఈ సంస్థలు 19 కి పెరిగాయి.[27] విరాళాల ధనాన్ని వెచ్చించడం పలువురి విమర్శలకు గురయ్యింది.క్రిస్తోఫేర్ హిచెన్స్ మరియు జర్మన్ పత్రిక స్టెర్న్ (పత్రిక) మదర్ థెరీసా , విరాళాల ధన్నాన్ని పేదరికం తొలగించడానికి లేక ధర్మశాలలలోని పరిస్థితులను మెరగుపరచడానికి కాక కొత్త మఠాలను ఏర్పాటు చేయడానికి మతపరమైన కార్యక్రమాలను పెంచడానికి వెచ్చించారని అన్నారు.[28] అంతేకాక విరాళాలు సేకరించిన వనరులు కూడా విమర్శించ బడ్డాయి.మదర్ థెరీసా హైతిలోని నిరంకుశ మరియు అవినీతి పరులైన దువలిఎర్ కుటుంబం నుండి విరాళాలను అంగీకరించి వారిని బహిరంగంగా పొగిడారు.కీటింగ్ ఫైవ్ స్కాండల్ గా పేరుపొందిన కేసులో , మోసము మరియు అవినీతి ఆరోపణలతో నిందితుడిగా ఉన్న చార్లెస్ కీటింగ్ నుండి 1.4 మిలియన్ డాలర్ల విరాళాన్ని అంగీకరించి, అరెస్టు కు ముందు మరియు తరువాత కూడా అతనిని బలపరిచారు. లాస్ ఏంజిలిస్ నగర డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ, పాల్ టర్లీ ప్రజల నుండి కీటింగ్ దొంగిలించిన విరాళాల సొమ్మును ప్రజలకు ఇచ్చి వేయవలసినదిగా వ్రాసారు, వారిలో ఒకరు పేద వడ్రంగి.ఆ విరాళాల దానం లెక్కలలో చూపబడలేదు మరియు టర్లీ జవాబు అందుకోలేదు. కలేట్టే లివేర్మోర్, మిషనరీస్ అఫ్ ఛారిటీ పూవా సభ్యురాలు, తాను సంస్థను విడిచి పెట్టడానికి గల కారణాలను తన పుస్తకం హోప్ ఎండ్యుర్స్: లీవింగ్ మదర్ థెరీసా, లూసింగ్ ఫైత్, అండ్ సెర్చింగ్ ఫర్ మీనింగ్ లో వివరించారు. మదర్ థెరీసా మంచితనం మరియు ధైర్యం కలిగియున్న వ్యక్తి ఐనప్పటికీ ఆమె "బాధ వేదాంతము" దోష పూరితమైనదని అన్నారు.మదర్ థెరీసా, తన శిష్యులకు, మతపరమైన ఉపదేశాలకంటే తమ చర్యల ద్వారా క్రీస్తు చరిత్రను వ్యాపింప చేయాలని ఆదేశించినప్పటికీ, సంస్థ లోని కొన్ని పద్ధతులు వీటితో సరిపోలనట్లు లివేర్మోర్ గుర్తించారు.నిబంధనల ప్రకారం కాకుండా వేళ తప్పి సన్యాసినుల సహాయార్ధం వచ్చిన వారికి సహాయాన్ని నిరాకరించడం, వారు బాధపడే రోగాలకు సంబంధించి చికిత్సలో శిక్షణ పొందేందుకు సన్యాసినులను నిరాకరించుట(బలహీనులకు మరియు అమాయకులకు దేవుడు శక్తినిస్తాడనే సమాధానంతో), స్నేహితుల నుండి దూరంగా బదిలీ చేయడం వంటి "అనుచితమైన" శిక్షలను విధించే వారని ఉదాహరణలు ఇచ్చారు.లౌకిక పరమైన పుస్తకాలను, దినపత్రికలను చదవడాన్ని నిషేధించడం, సమస్యా పరిష్కారానికి స్వంత ఆలోచన లేకుండా విధేయతకు ప్రాముఖ్యత నివ్వడం వంటి వాటితో మిషనరీస్ అఫ్ ఛారిటీ తన సన్యాసినులను"శిశువులను" చేసిందని లివేర్మోర్ పేర్కొనారు.[29] క్షీణించిన ఆరోగ్యం మరియు మరణం 1983 లో పోప్ జాన్ పాల్ II సందర్శనార్ధం మదర్ థెరీసా, రోమ్ వెళ్ళినప్పుడు గుండెపోటుకు గురయ్యారు. 1989 లో రెండవసారి గుండెపోటుకు గురైనపుడు ఆమెకు కృత్రిమ పేస్ మేకర్ ను అమర్చారు. 1991 లో మెక్సికోలో న్యుమోనియాతో పోరాడుతున్నపుడు ఆమె మరిన్ని హృదయ సమస్యలను ఎదుర్కున్నారు. మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవికి ఆమె తన రాజీనామాను సమర్పించారు.కానీ సంస్థ లోని సన్యాసినులు రహస్య ఎన్నిక ద్వారా ఆమె కొనసాగాలని కోరారు. సంస్థ అధిపతిగా కొనసాగడానికి మదర్ థెరీసా అంగీకరించారు. ఏప్రిల్ 1996, లో మదర్ థెరీసా క్రిందపడటం వలన ఆమె మెడ ఎముక విరిగింది.ఆగష్టులో ఆమె మలేరియాతో బాధ పడటంతో పాటు గుండె ఎడమభాగంలోని జఠరిక(గుండె) పనిచేయడం మానివేసింది.ఆమెకు గుండె శస్త్రచికిత్సజరిగింది , కానీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం వెల్లడైంది. తాను అనారోగ్యం పాలైనపుడు తన వైద్యశాలలలో ఏదో ఒక దానిలో చికిత్స పొందకుండా, కాలిఫోర్నియాలో అన్ని హంగులతో కూడిన వైద్యశాలను ఎంచుకొనడం వివాదాలకు దారితీసింది.[30] మార్చ్ 13, 1997 న ఆమె మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవి నుండి వైదొలిగారు, సెప్టెంబర్ 5, 1997 న మరణించారు. మదర్ థెరీసాకు మొదటి సారి హృదయ సంబంధ సమస్యలు ఎదురైనపుడు తాను, ఆమెదెయ్యం యొక్క దాడికి గురైందని భావించి దెయ్యాన్ని వదలగొట్టడానికి ఆమె అనుమతితో ఒక ఆచార్యుని ఆజ్ఞాపించినట్లు కలకత్తా ఆర్చ్ బిషప్ హెన్రీ సెబాస్టియన్ డి'సౌజా చెప్పారు.[31] ఆమె చనిపోయే నాటికి మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ 4,000 సన్యాసినులు, 300 మంది అనుబంధ సోదర సభ్యులు , మరియు 100,000 పైగా సాధారణ కార్యకర్తలను కలిగి, 123 దేశాలలో 610 శాఖలను కలిగి ఉంది. వీటిలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారి సంరక్షణ గృహాలు మరియు హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు వ్యాధి మరియు క్షయ రోగులకు ఆవాసాలు,ఆహారకేంద్రాలు, అనాధ శరణాలయాలు, మరియు పాఠశాలలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్త గుర్తింపు మరియు ఆదరణ భారతదేశంలో ఆదరణ 1962 లో పద్మశ్రీ బహూకరించడం ద్వారా శతాబ్ద మూడో భాగంలో అందరికంటే ముందుగా భారతప్రభుత్వం ఆమెను గుర్తించింది.తరువాతి దశాబ్దాలలో వరుసగా ఆమె భారత దేశ అత్యున్నత పురస్కారాలైన అంతర్జాతీయ అవగాహనకు గాను జవహర్లాల్ నెహ్రూఅవార్డును 1972 లోను, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 1980 లోను అందుకున్నారు. ఆమె జీవిత చరిత్రను ఇండియన్ సివిల్ సర్వీసు అధికారి ఐన నవీన్ చావ్లా రచించి, 1992 లో ప్రచురించారు.[32] భారతీయుల అభిప్రాయాలు మదర్ థెరీసాకు పూర్తిగా అనుకూలంగా లేవు.భారతదేశంలో పుట్టి, పెరిగి లండన్లో నివసించిన ఆమె విమర్శకుడు అరూప్ చటర్జీ మాటలలో, "ఆమె జీవిత కాలంలో ఎప్పుడూ ఆమె కలకత్తాలో ప్రముఖ వ్యక్తి కారు".తన స్వంత నగరానికి ఒక వికృతమైన రూపాన్ని వ్యాపింప చేసినదుకు చటర్జీ మదర్ థెరీసాను తప్పు పట్టారు. ఆమెహిందూ హక్కులకు వ్యతిరేకంగా ఉండటం వలన భారత రాజకీయ ప్రపంచంలో ఆమె పాత్ర మరియు ఉనికి నిరసించ బడ్డాయి.భారతీయ జనతా పార్టీ, క్రైస్తవ దళితుల, విషయమై ఆమెతో సంఘర్షించింది, కానీ మరణానంతరం ప్రస్తుతించి అంత్యక్రియలకు దూతను పంపింది. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఆ సంస్థ కార్యదర్శి గిరిరాజ్ కిషోర్, "ఆమె మొదటి విధి చర్చి, సామాజిక సేవ యాదృచ్చికంగా జరిగింది " అన్నారు మరియు ఆమె క్రైస్తవులకు అనుకూలంగా ఉండటాన్ని, మరణించ బోయేవారికి "రహస్య మతమార్పిడి" చేయడాన్ని తప్పుపట్టారు.ఫ్రంట్ లైన్ అనే భారతీయ పక్ష పత్రిక తన ప్రధమ పుట వ్యాసంలో ఈ ఆరోపణలు "స్పష్టంగా నిరాధారమైనవని" కొట్టి పారేసింది. ఆమె కార్య క్రమాలలో, ప్రత్యేకించి కలకత్తాలో ప్రజాసేవను గురించి వారు గుర్తించలేదని అన్నది". ఈ వ్యాస రచయిత ఆమె "స్వలాభంలేని పరోపకారం", శక్తి మరియు ధైర్యాన్ని ప్రస్తుతించినప్పటికీ, గర్భ స్రావానికి వ్యతి రేకంగా ప్రచారం చేస్తూ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నట్లు చెప్పుకోవడాన్ని విమర్శించారు. ఈ మధ్య కాలంలో భారత దినపత్రిక ది టెలిగ్రాఫ్ ఈ విధంగా ప్రచురించింది, "ఆమె పేద ప్రజల పరిస్థితుల ఉపశమనం కొరకు ఏమైనా చేసారా లేక ఒక నైతిక భావపరమైన కారణం కొరకు జబ్బుపడిన మరియు మరణించిన వారికి సేవలు కల్పించారో శోధించాలని రోమ్ ని అడగటం జరిగింది."[33] సెప్టెంబర్, 1997 లో ఆమె అంత్యక్రియలకు ముందు మదర్ థెరీసా భౌతిక కాయాన్ని ఒక వారం రోజులపాటు సెయింట్ థామస్, కోల్కతా లో ఉంచడం జరిగింది. భారతదేశంలో అన్ని మతాల ప్రజలకు ఆమె చేసిన సేవలకు కృతజ్ఞతగా ప్రభుత్వం ఆమెకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలను జరిపించింది.[34] ప్రపంచదేశాల ఆదరణ 1985 లో, వైట్ హౌస్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్, మదర్ థెరీసాకు ప్రెసిడెన్షియల్ మెడల్ బహుకరణ దక్షిణ లేదా తూర్పు ఆసియా దేశాల వారికి ఇచ్చే ఫిలిప్పీన్స్ కు చెందిన రామన్ మాగ్సేసే అవార్డును 1962 లో మదర్ థెరీసా అంతర్జాతీయ అవగాహనకు గాను అందుకున్నారు. ఆ పత్రంలో ఈ విధంగా ఉదాహరించారు, "పరాయి దేశంలోని అతి పేద ప్రజల కొరకు ఆమె దయతో కూడిన ఆలోచనను,మరియు వారి సేవకై ఆమె స్థాపించిన నూతన సమాజాన్ని ఎంపికమండలి గుర్తించింది." [35] 1970 ల నాటికి మదర్ థెరీసా అంతార్జాతీయంగా ప్రముఖ వ్యక్తి అయ్యారు. ఆమె కీర్తిలో చాలా భాగం మాల్కం ముగ్గేరిడ్జ్ చే నిర్మించబడిన 1969 లోని డాక్యుమెంటరీ సంతింగ్ బ్యూటిఫుల్ ఫర్ గాడ్ కు, మరియు 1971 లో ఆయనచే అదే పేరుతో రచింపబడిన పుస్తకానికి దక్కుతుంది.ముగ్గేరిడ్జ్ ఆ సమయంలో తనదైన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు. ఈ డాక్యుమెంటరీ నిర్మాణ సమయంలో హోం ఫర్ ది డయింగ్ లో ఉన్న తక్కువ కాంతి వలన ఈ చిత్రీకరణ ఉపయోగ పడదేమోనని నిర్మాణ వర్గం అభిప్రాయ పడింది.భారతదేశం నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ భాగం మంచి కాంతివంతంగా కనిపించింది.ముగ్గేరిడ్జ్ ఆ తరువాత అది మదర్ థెరీసా యొక్క "దివ్య కాంతి" గా అభివర్ణించారు.నిర్మాణ వర్గంలో మిగిలిన వారు మాత్రం అతి సున్నితమైన కోడాక్ ఫిలిం వలన ఈ ఫలితం వచ్చినదని అన్నారు.ముగ్గేరిడ్జ్ ఆ తరువాత రోమన్ కాథలిక్ మతం తీసుకున్నారు. ఈ సమయానికి, కాథొలిక్ ప్రపంచం బహిరంగంగా మదర్ థెరీసాను గౌరవించడం మొదలుపెట్టింది.పేద ప్రజల కొరకు ఆమె చేపట్టిన కార్యక్రమాలు, క్రైస్తవ ధర్మం మరియు శాంతి పట్ల ఆమె కృషిని మెచ్చుకొని, 1971 లో పాల్ VI ఆమెకు మొదటి పోప్ జాన్ XXIII శాంతి బహుమతి ని అందచేసారు. తరువాత ఆమె పసెమ్ ఇన్ టేర్రిస్ అవార్డు (1976)అందుకున్నారు. ఆమె మరణం తరువాత దివ్యత్వం వైపు ఆమె అడుగులు త్వరగా వృద్ధి చెంది, ప్రస్తుతం దైవ ఆశీర్వాదం (బీటిఫై) పొందారు . మదర్ థెరీసా ప్రభుత్వాలచేత మరియు పౌరసంస్థలచేత గౌరవింప బడ్డారు.ఆస్ట్రేలియా సమాజానికి మరియు మానవ సమాజానికి చేసిన సేవకు గాను ఆమెను ఆర్డర్ అఫ్ ఆస్ట్రేలియాకు గౌరవసహచరిగా నియమించారు.[36]యునైటెడ్ కింగ్‌డమ్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనేక పురస్కారాలు అందచేసి చివరిగా 1983లోఆర్డర్ అఫ్ మెరిట్ మరియు నవంబర్ 16, 1996లో యునైటెడ్ స్టేట్స్ యొక్క గౌరవ పౌరసత్వం అందచేసారు. మదర్ థెరీసా స్వదేశమైన అల్బేనియా 1994లో ఆమెకు గోల్డెన్ ఆనర్ అఫ్ ది నేషన్ ను, మరియు ఆమెకు 1991 లో పౌరసత్వాన్ని ఇచ్చి గౌరవించింది.[37] ఈ బహుమతిని మరియుహైతి ప్రభుత్వం ఇచ్చిన బహుమతిని ఆమె అంగీకరించటం వివాదాస్పదమైనది. దువలిఎరస్, చార్లెస్ కీటింగ్, రాబర్ట్ మాక్స్వెల్ వంటి అవినీతి పరులైన వ్యాపారులకు సంపూర్ణ మద్దతు అందించినందుకు మదర్ థెరీసా విమర్శలను, ప్రత్యేకించి వామపక్షాల నుంచి ఎదుర్కున్నారు. కీటింగ్ కేసు విచారణలో ఆమె న్యాయాధికారికి అతని పై దయ చూపవలసినదిగా కోరుతూ వ్రాసారు.[20] భారదేశపు మరియు పశ్చిమదేశాల విశ్వవిద్యాలయాలు ఆమెకు గౌరవ పట్టాలను అందచేశాయి. ఇతర పౌరపురస్కారాలలో మానవత్వాన్ని, శాంతిని మరియు ప్రజలమధ్య సోదరభావాన్ని పెంపొందించినందుకు బల్జాన్ బహుమతి(1978),[38] మరియు ఆల్బర్ట్ స్క్వీట్జేర్ అంతర్జాతీయ బహుమతి(1975) మొదలైనవి ఉన్నాయి.[39] శాంతికి విఘాతం కలిగించే పేదరికాన్ని మరియు దుఃఖాన్ని తొలగించేందుకు ఆమె చేసిన కృషికి 1979 లో మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి అందచేసారు.బహుమతి గ్రహీతలకు మర్యాద పూర్వకంగా ఇచ్చే సాంప్రదాయ విందును నిరాకరించి $192,000 నిధులను భారత దేశం లోని పేద ప్రజలకు ఇవ్వవలసినదిగా కోరుతూ,[40] భౌతికపరమైన బహుమతులు ప్రపంచంలోని అవసరార్ధులకు ఉపయోగపడినపుడే వాటికి ప్రాముఖ్యత వుంటుంది అన్నారు.మదర్ థెరీసా ఈ బహుమతిని అందుకున్నపుడు ఆమెను "ప్రపంచశాంతిని పెంపొందించేందుకు మనము ఏమి చేయగలం?" అని అడిగారు."ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి" అని చెప్పారు.ఈ విషయం పై ఆమె తన నోబెల్ ఉపన్యాసంలో ఈ విధంగా అన్నారు:"పేద దేశాలలోనే కాక ప్రపంచం మొత్తంలో నేను పేదరికాన్ని చూసాను, కానీ పాశ్చాత్య దేశాలలోని పేదరికం తొలగించడం కష్టం.నేను వీధులలో ఆకలిగొన్న వానిని కలిసినపుడు అతనికి కొంత అన్నము, ఒక రొట్టెముక్క ఇచ్చి తృప్తిపడతాను. నేను అతని ఆకలిని తొలగించగలిగాను.కానీ ఒక వ్యక్తి గెంటివేయబడినపుడు, పనికిరాని వ్యక్తిగా భావించబడినపుడు, ప్రేమింపబడనపుడు, భీతిల్లినపుడు, సమాజంచే వెలివేయబడినపుడు-ఆ రకమైన పేదరికం చాల బాధాకరమైనది మరియు నా దృష్టిలో తొలగించుటకు కష్టమైనది." గర్భ స్రావాన్ని 'ప్రపంచ శాంతికి అతి పెద్ద విఘాతంగా' ఆమె పేర్కొన్నారు.[41] ఆమె జీవిత చరమాంకంలో మదర్ థెరీసా పాశ్చాత్య మీడియా యొక్క వ్యతిరేకతను ఎదుర్కున్నారు.క్రిస్టఫర్ హిచెన్స్ అనే విలేఖరి ఆమెను విమర్శించిన వ్యక్తులలో ముఖ్యులు.అరూప్ ఛటర్జీ ప్రోత్సాహంతో బ్రిటిష్ ఛానల్ 4 చే నిర్మించబడిన హెల్స్ ఏంజెల్ అనే డాక్యుమెంటరీకి ఆయన సహ-రచన మరియు వ్యాఖ్యానం కొరకు నియమింపబడ్డారు, కానీ ఆ డాక్యుమెంటరీ పూర్తైన తరువాత ఛటర్జీ దాని "సంచలనాత్మక విధానం" పై అసంతృప్తి వ్యక్తం చేసారు.1995 లో తన ది మిషనరీ పొజిషన్ అనే గ్రంధంలో హిచెన్స్ తన విమర్శలను కొనసాగించారు.[42] మదర్ థెరీసా జీవించి ఉన్నపుడు ఆమెగానీ, ఆమె జీవితచరిత్రకారులు గానీ తన పరిశోధనలకు సహకరించకపోవడమేగాక, పాశ్చ్యాత్య వార్తాసంస్థల విమర్శలను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని చటర్జీ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణలుగా " ఆమె అనాధ శరణాలయాలలోని పరిస్థితుల ..... [తో సహా ]తీవ్ర అనాదరణ మరియు శారీరక మరియు మానసిక హింసలపై బ్రిటన్లోని ది గార్డియన్ యొక్క ఖండితమైన(మరియు వివరణాత్మకమైన) ఆరోపణను, మదర్ థెరీసా: టైం ఫర్ చేంజ్? అనే డాక్యుమెంటరీలను పేర్కొన్నారు ఇది అనేక యురోపియన్ దేశాలలో ప్రసారమైంది. ఛటర్జీ మరియు హిచెన్స్ వారి వైఖరిపై విమర్శలను ఎదుర్కొన్నారు. జర్మన్ పత్రిక ఐనస్టెర్న్ మదర్ థెరీసా తొలి సంవత్సరీకంపై విమర్శనాత్మక వ్యాసాన్ని ప్రచురించింది.ఇది ఆర్ధిక వ్యవహారాలు మరియు విరాళాల వినియోగంపై అభియోగాలకు సంబంధించినది.రోగుల అవసరాలపై ఆమె ప్రత్యేకథోరణులు ప్రాధాన్యతల పట్ల వైద్య పత్రికలు ఆమెపై విమర్శలను ప్రచురించాయి.[20] ఇతర విమర్శకులలో న్యూ లెఫ్ట్ రివ్యూ సంపాదకుల మండలి సభ్యుడైన తారిక్ అలీ, మరియు ఐరిష్ జాతీయుడైన పరిశోధనాత్మక విలేఖరి డోనాల్ మాక్ఇన్టైర్ఉన్నారు.[42] లౌకికవాద సంస్థలూ మరియు మతసంఘాలూ ఆమె మరణంపై సంతాపం ప్రకటించాయి.పాకిస్తాన్ ప్రధానమంత్రి ఐన నవాజ్ షరీఫ్ తన సంతాపంలో "ఉన్నత ఆశయాలకోసం చిరకాలం జీవించిన అరుదైన మరియు ప్రత్యేకవ్యక్తి అని శ్లాఘించారు. పేద, జబ్బుపడిన మరియు అప్రయోజకుల కొరకు జీవితపర్యంతం ఆమె చూపిన శ్రద్ధ, మానవసేవకు అత్యున్నత ఉదాహరణ అని కొనియాడారు .[43] మాజీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ జేవియర్ పెరెజ్ డి క్యులర్ ఈ విధంగా అన్నారు:"ఆమే ఐక్యరాజ్యసమితి.ఆమె ప్రపంచంలోని శాంతి".[43] ఆమె జీవించి ఉన్నపుడు మరణించిన తరువాత కూడా గాల్లప్ ద్వారా అమెరికాలో అత్యధికంగా అభిమానించ బడిన ఏకైక వ్యక్తిగా గుర్తించబడి, 1999 లో యునైటెడ్ స్టేట్స్ లో జరిగిన ఒక సర్వేలో "20 శతాబ్దపు అత్యధిక అభిమానం పొందిన వ్యక్తి" గా ఎన్నికయ్యారు. మిగిలిన అందరు అభ్యర్దుల కంటే ఎక్కువ వ్యత్యాసంతో ఆధిక్యత పొందటమే గాక, అతి పిన్న వయస్కులు తప్ప అన్ని జనాభా వర్గాలనుండి ప్రధమ స్థానం పొందారు.[44][45] ఆధ్యాత్మిక జీవితం ఆమె సాధించిన కార్యాలను, కృత్యాలను విశ్లేషిస్తూ జాన్ పాల్ II ఈ విధంగా ప్రశ్నించారు:"ఇతరుల సేవకై తనను వినియోగించుకొనే శక్తినీ పట్టుదలనూ మదర్ థెరీసా ఎక్కడ నుండి పొందుతారు?ఆమె దానిని తన ప్రార్థనలో మరియు యేసు క్రీస్తు యొక్క నిశ్శబ్దధ్యానంలో, ఆయన పావన వదనంలో, పవిత్ర హృదయం లో పొందుతారు."[46] తనలోతనకి మదర్ థెరీసా యాభైసంవత్సరాల పాటు, తన జీవితపర్యంతం మతపరమైన తన నమ్మకాలపై సందేహాలను మరియు ప్రయాసలను వ్యక్తం చేసారు, ఈక్రమంలో "ఆమె దేవుడనేవాడు లేడని భావించారు", "ఆమె హృదయంలోనే కాదు కృతజ్ఞతలో కూడా" అని ఆమె ప్రతిపాదకుడు (ఆమె పవిత్రీకరణకు ఆధారాలు సేకరించేందుకు బాధ్యుడైన అధికారి) రెవ.బ్రయాన్ కోలోదిఎజ్చుక్ అన్నారు.[47]. మదర్ థెరీసా దేవుని ఉనికిపై ఉపేక్షింపరాని సందేహాలను వెలిబుచ్చారు మరియు తన అవిశ్వాసానికి బాధను వ్యక్తం చేసారు. “ నా నమ్మకం ఎక్కడ? లోలోతులలో కూడా... శూన్యత మరియు చీకట్లు తప్ప మరేమిలేదు ... దేవుడనే వాడుంటే నన్ను దయచేసిక్షమించు. నేను స్వర్గలోకాన్ని గురించి ఆలోచించే ప్రయత్నం చేసినపుడు, అప్పుడు కనబడే శూన్యత ద్వారా నా ఆలోచనలు పదునైన కత్తులుగాతిరిగి వచ్చి నా ఆత్మని బాధిస్తాయి... ఈ తెలియని బాధ ఎంత బాధాకరమంటే - నాకు దేవునిపై నమ్మకం లేదు. తిరస్కరించబడి, శూన్యంగా, నమ్మకం లేకుండా, ప్రేమ లేకుండా మరియు , నిరాసక్తత , ...నేను దేనికొరకు శ్రమిస్తున్నాను? దేవుడే లేకపోతే ఆత్మ వుండనే వుండదు. ఆత్మ లేకపోతే, యేసూ, నీవుకూడా నిజంకాదు.[48] ” మెమోరియల్ ప్లేక్ డేడికేటేడ్ టు మదర్ థెరీసా అట్ అ బిల్డింగ్ ఇన్ వెన్స్స్లాస్ స్క్వేర్ ఇన్ ఒలోమొక్, చెక్ రిపబ్లిక్. పై మాటలను బట్టి, ఆమె ప్రతిపాదకుడైన రెవ్. బ్రయాన్ కోలోదిఎజ్చుక్, ఆమె అంతరార్ధాన్ని కొందరు తప్పుగా వ్యాఖ్యానించే అవకాశం ఉంది కానీ దేవుడు తన ద్వారా సేవ చేయిస్తున్నాడనే ఆమె భావం చెరిగి పోనిది, ఆమె దేవుని ఉనికిని ప్రశ్నించక ఆయనతో తన బంధాన్ని నిలుపుకోవడానికి పరితపించింది అని వ్యాఖ్యానించారు.[49] ఇతర పరిశుద్ధులకు |
About us|Jobs|Help|Disclaimer|Advertising services|Contact us|Sign in|Website map|Search|
GMT+8, 2015-9-11 20:14 , Processed in 0.147981 second(s), 16 queries .