సలామ్ (అరబిక్ భాష : السلام "అస్సలామ్") క్రింది విధాలుగా అర్థాలు కలిగివున్నది: సీన్-లామ్-మీమ్ (హిబ్రూ భాష : שלם Š-L-M, అరబ్బీ : س ل م S-L-M, మాల్టెస్ : S-L-M) ఒక ట్రైకాన్సోనాటల్ పదము. ఇది సెమెటిక్ భాష పదాలు మరియు వాటి ఉపయోగాలు కలిగిన మూల పదం. ఈ మూల పదానికి మూలార్థం "సంపూర్ణం, నిరపాయ మరియు బాంధవ్య" అనే భావార్థాలు గలది. అర్థాలు అరబ్బీ భాష లో తస్లీమ్ : "సలామ్ స్వీకారం" — "స్వీకారం" ముస్తలీమ్ : "సలామ్ స్వీకారానికి స్వాగతించడం" "ఒప్పుకోలు" లేదా "అంగీకారం" లేదా "విధేయత ప్రకటించడం". సలేమ్ : "సలామ్" కు సంబంధించిన, అఖండిత, పరిపూర్ణ అనే అర్థాలు గోచరిస్తాయి. ముసల్లమ్ : "వివాదములేని" ముస్లిం : ఇస్లాం మతావలంబీకుడు ఇస్లాం : శాంతిమార్గము "షలోమ్" (నీలి రంగులో) మరియు "సలామ్" (ఆకుపచ్చ రంగులో) అర్థం "శాంతి". హిబ్రూ మరియు అరబ్బీలో దీనికి శాంతికి చిహ్నం గా అభివర్ణిస్తారు. అల్లాహ్ పేరు అల్లాహ్ విశేషణమాత్మక 99 నామాలలో ఒక నామం "సలామ్". అభివాదం అస్సలాము అలైకుమ్( السلام عليكم ): (As-Salāmu `Alaykum) ఒక అభివాదం. దీని అర్థం "శాంతి". అస్సలామ్ ఒ అలైకుమ్ అని అభివాదం చేస్తే దానర్థం "మీపై శాంతి కలుగును గాక". (తెలుగులో అభివాదం: నమస్కారం) ఈ అభివాదానికి ప్రత్యుత్తరం : వ-అలైకుమ్ అస్సలామ్. దీనర్థం, మీకునూ శాంతి కలుగును గాక. సాహిత్యంలో సలామ్ అరబ్బీ, ఫార్సీ, తుర్కీ మరియు ఉర్దూ భాషా సాహిత్యాలలో సలామ్ అనునది ఒక కవితా రూపం. మహమ్మదు ప్రవక్త , హుసేన్ ఇబ్న్ అలీ మరియు ఇతర ఔలియా లను శ్లాఘిస్తూ సమర్పించే వందనాన్ని సలామ్ అంటారు. ఉదాహరణకు ఒక ప్రఖ్యాత "సలామ్" యా నబీ సలామ్ అలైక యా రసూల్ సలామ్ అలైక యా హబీబ్ సలామ్ అలైక సలవాతు లా అలైక |
About us|Jobs|Help|Disclaimer|Advertising services|Contact us|Sign in|Website map|Search|
GMT+8, 2015-9-11 20:13 , Processed in 0.164219 second(s), 16 queries .